
పర్యాటకం.. అభివృద్ధికి దూరం
● కడెం.. సహజ సౌందర్య నిలయం ● ఏడాది పొడవునా పర్యాటకుల రాక ● శిథిలావస్థకు డీలక్స్ బోటు ● మూలనపడిన స్పీడ్ బోటు ● పట్టించుకోని పర్యాటక శాఖ
కడెం: సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నిలయంగా నిలిచిన కడెం ప్రాజెక్టు, రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. 2010లో పర్యాటక శాఖ బోటింగ్‌ను ప్రవేశపెట్టడంతో పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ అందమైన ప్రాజెక్టును తిలకించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. అయితే, పెరిగిన పర్యాటకుల సంఖ్యకు తగ్గ సౌకర్యాలు లేకపోవడంతో సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కడెంను పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
పర్యాటక కేంద్రంగా..
2010లో బోటింగ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కడెం ప్రాజెక్టు పర్యాటక రంగంలో గణనీయమైన ఆదరణ పొందింది. 2015లో 12 విడిది గదులు, రెస్టారెంట్‌తో కూడిన హరిత రిసార్ట్స్‌ను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం మరింత ఆకర్షణీయంగా మారింది. ప్రస్తుతం హరిత రిసార్ట్స్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. పర్యాటకుల విడిది కోసం ఒక రిసార్ట్, రెండు లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాలతో కడెం రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపొందింది.
అభివృద్ధి లేక ఇబ్బందులు..
కడెం బోటింగ్ యూనిట్‌లో ఒక డీలక్స్ బోటు, స్పీడ్ బోటును ప్రవేశపెట్టినప్పటికీ, సౌకర్యాల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. గతంలో రూ.30గా ఉన్న బోటింగ్ టికెట్ ధరను రూ.50కి పెంచారు, కానీ సౌకర్యాలు మెరుగుపరచకపోవడంతో ఆదాయం గణనీయంగా తగ్గింది. స్పీడ్ బోటు మోటారు చెడిపోయి సంవత్సరాలు గడిచినా మరమ్మతులు చేయకపోవడంతో అది మూలన పడింది. డీలక్స్ బోటు శిథిలావస్థలో ఉన్నప్పటికీ, తాత్కాలిక మరమ్మతులతో నడుపుతున్నారు. బోటింగ్‌కు 16 మంది లేదా రూ.600 చెల్లించాల్సిన నిబంధన వల్ల చాలా మంది పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
శిథిలావస్థలో సౌకర్యాలు..
కడెం బోటింగ్ స్టాండ్‌ను గతంలో రాత్రికి రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా సోమశీలకు తరలించారు, దాని స్థానంలో పాత స్టాండ్‌ను వదిలేశారు. ప్రస్తుతం ఈ స్టాండ్ కూడా శిథిలావస్థకు చేరింది. బోటింగ్ సిబ్బంది తాత్కాలికంగా తాళ్లు, తెప్పలతో దాన్ని నడిపిస్తున్నారు, దీంతో పర్యాటకులకు ప్రమాద భయం పొంచి ఉంది. సౌకర్యాల నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల గతంలో లక్షల్లో వచ్చిన ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.
అభివృద్ధి చేయాలి
మిత్రులతో కలిసి కడెం ప్రాజెక్టు సందర్శనకు వచ్చాం. కడెం ప్రాజెక్ట్, పరిసర ప్రాంతాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలి. నీటి మధ్యలో ఉన్న ఐ ల్యాండ్ వరకు బోటును తీసుకెళ్తే బాగుంటుంది. ప్రాజెక్ట్‌లో వాటర్ గేమ్స్ లాంటివి ఏర్పాటు చేయాలి. – చంద్రశేఖర్,
పర్యాటకుడు, విజయవాడ
ప్రాజెక్టు అందాలు బాగున్నాయి
కడెం ప్రాజెక్టును విజిట్ చేశాం. ప్రకృతి సిద్ధమైన కడెం ప్రాజెక్టు అందాలు బాగున్నాయి. బోటింగ్ చేశాం. ఇక్కడ ఒకటే బోటు ఉంది. స్పీడ్ బోటుతో పాటు పైడల్ బోటు లాంటిివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– దివ్య, పర్యాటకురాలు, రాజమండ్రి

పర్యాటకం.. అభివృద్ధికి దూరం

పర్యాటకం.. అభివృద్ధికి దూరం

పర్యాటకం.. అభివృద్ధికి దూరం

పర్యాటకం.. అభివృద్ధికి దూరం