
ఎరుకల సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఓదెలు
రామకృష్ణాపూర్: ఎరుకల ప్రజా సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన రేవెల్లి ఓదెలును ఎన్నుకున్నారు. మంగళవారం శ్రీరాంపూర్‌లో జరిగిన సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి నియామకపత్రం అందజేశారు. ఎరుకల ప్రజల అభివృద్ధి కోసం, ఎరుకల జాతి చైతన్యం కోసం తనవంతు కృషి చేస్తానని ఓదెలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
ఆదిలాబాద్: జాతీయ స్థాయి జూనియర్ హాకీ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, పార్థసారథి తెలిపారు. ఆదిలాబాద్ ప్రభుత్వ గిరిజన డిగ్రీ కళాశాలకు చెందిన కొడప ప్రదీప్, వెట్టి సుదర్శన్ ఎంపికయ్యారని, ఈ నెల 12 నుంచి పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగే పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు.
ఒకరిపై గంజాయి కేసు
ఇంద్రవెల్లి: మండలంలోని దనోరా(బి)లో ఒకరిపై గంజాయి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. గ్రామానికి చెందిన పరశురాం తన ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు సాగు చేసినట్లు తమకు అందిన సమాచారం మేరకు మంగళవారం తనిఖీలు నిర్వహించగా 23 గంజాయి మొక్కలు లభ్యమైనట్లు తెలిపారు. మొక్కలను ధ్వంసం చేసి నిందితునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఎరుకల సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఓదెలు