
గిత్తే కార్తీక్‌కు ఆర్థికసాయం
కెరమెరి: హిమాచల్ ప్రదేశ్‌లోని స్పీటీ వ్యాలిలో ఈ నెల 9నుంచి 19 వరకు నిర్వహించే మౌంట్ యూనమ్ పర్వతారోహనకు కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలోని కెలికే గ్రామానికి చెందిన మౌంటేనీయర్ గిత్తే కార్తీక్ ఎంపికయ్యాడు. సికింద్రాబాద్‌కు చెందిన గ్లోబల్ హిందూ ఫెడరేషన్, ఛత్రపతి శివాజీ మహరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ సీడీ చౌహాన్ మంగళవారం ఛత్రపతి శివాజీ ప్రతిమతో పాటు రూ.20 వేల ఆర్థికసాయం అందజేశారు. సాహసయాత్ర పూర్తి చేసుకున్నాక మరో రూ.30 వేలు అందించనున్నట్లు ప్రకటించారు. కాగా కార్తీక్ హైదరాబాద్‌లోని ఏఐఎంఎస్ కాలేజీ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అడ్వాన్స్‌డ్ మౌంటనీరింగ్ కోర్సును గతంలో పూర్తి చేశాడు. ఎన్నో సాహస కృత్యాల్లో పాల్గొని అవార్డులు సొంతం చేసుకున్నాడు.