
దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గద్దెరాగిడి భవానీ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఈ నెల 3న ఓ యువకుడిపై దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడు పంగ శ్రీధర్‌ను మంగళవారం అరెస్టు చేసినట్లు మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గద్దెరాగిడికి చెందిన ఊటూరి హరీష్ భవానీ బార్ దగ్గర ఉండగా అక్కడే ఉన్న శ్రీధర్ తనకు మద్యం ఇప్పించాలని కోరగా నిరాకరించడంతో మహేందర్, తిరుపతి అనే మరో ఇద్దరు స్నేహితులతో కలిసి దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీధర్‌ను అరెస్టు చేసి అతనిపై రౌడీషీట్‌కు కూడా ఓపెన్ చేశామని, పరారీలో ఉన్న మరో ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.