
రెండు ఎడ్లు, ఆవు అపహరణ
తానూరు(ముధోల్): ముధోల్ మండల కేంద్రంలోని ముక్త దేవి కాలనీలో ఆదివారం రాత్రి హంగిర్గ భోజన్నకు చెందిన రెండు ఎడ్లు, ఒక ఆవును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. భోజన్న తన రెండు ఎడ్లు, ఒక ఆవును సాయంత్రం రోడ్డు పక్కన ఉన్న నీటి ట్యాంకు కింద కట్టేశాడు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వాటిని దొంగిలించారు. గమనించిన బాధితుడు భోజన్న సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్సై బిట్ల పెర్సిస్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించాడు. పశువుల విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని బాధిత రైతు పేర్కొన్నాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.