
న్యాక్ ఏడీ నాగేంద్రం బదిలీ
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ (న్యాక్) ఏడీగా పనిచేస్తున్న నాగేంద్రం హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బెల్లంపల్లికి చెందిన స్వప్నరాణిని ఏడీగా నియమించారు. సోమవారం బదిలీపై వెళ్తున్న ఏడీని, బాధ్యతలు చేపట్టిన నూతన ఏడీలను కార్యాలయ ఉద్యోగులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాక్ సిబ్బంది రమేశ్, దీపక్, మహేష్, తిరుపతి, మేరి విక్టోరియా, తదితరులు పాల్గొన్నారు.
నిధుల దుర్వినియోగంపై సీఐడీకి ఫిర్యాదు
నిర్మల్‌టౌన్: బీసీసీఐ నుంచి క్రికెట్ అభివృద్ధి కోసం విడుదలయ్యే నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకో వాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా కోచ్ రామరాజు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌లోని వివిధ జిల్లాల కార్యదర్శులతో కలి సి సోమవారం హైదరాబాద్‌లో సీఐడీకి ఫిర్యా దు చేశారు. పదేళ్లుగా హెచ్‌సీఏ జిల్లాల పేరుతో ఖాతాల్లో నమోదు చేసిన సుమారు రూ.12 కోట్లు దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇందుకు హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లు, జిల్లా కార్యదర్శులు చేకూరి వెంకట్ (ఖమ్మం), చాగంటి శ్రీనివాస్(వరంగల్), కోదాటి ప్రదీప్ (ఆదిలాబాద్), ఎం.రాజశేఖర్(మహబూబ్ నగర్), ఏ.రాజేందర్‌రెడ్డి (మెదక్), వెంకట్‌రెడ్డి(నిజామాబాద్), ఆగం రావు (కరీంనగర్), సయ్యద్ అమీనుద్దీన్ (నల్గొండ) ఉన్నారని వివరించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నిధులు రికవరీ చేయాలని కోరారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
ఆదిలాబాద్: ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన ఎస్.చరణ్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ రమేశ్ తెలిపారు. హన్మకొండలో ఈనెల 3, 4 తేదీ ల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ట్రయాథ్లాన్–ఏ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించాడు. సెప్టెంబర్ 9 నుంచి 11వరకు పాండిచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తాడని వెల్లడించారు. అదేవిధంగా హన్మకొండ వేదికగా జరిగిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సోమవారం క్రీడ పాఠశాలకు చెందిన విద్యార్థి శివాని 600 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్ అభినందించారు.
పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీల భర్తీ
మందమర్రిరూరల్: సీసీసీ (నస్పూర్)లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గానూ సింగరేణి కోటాలో వివిధ కోర్సుల్లో ఇంకా మిగిలి ఉన్న 66 సీట్లను భర్తీ చేయనున్నట్లు యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సివిల్ కోర్సులో 27, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో 06, మెకానికల్‌లో 23, మైనింగ్‌లో 10 సీట్లు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేసిన తర్వాత ప్రభుత్వ కన్వీనర్ కోటాలో మిగిలి ఉన్న సీట్లకు ఈ నెల 7న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9010222161 నంబర్‌లో సంప్రదించాలని సూచించింది.

న్యాక్ ఏడీ నాగేంద్రం బదిలీ