
పట్టపగలే రూ.5 లక్షలు చోరీ
భైంసాటౌన్: పట్టపగలే ఓ దుండగుడు స్కూటీ డిక్కీ తెరిచి రూ.5 లక్షలు అపహరించిన ఘటన భైంసా పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. ముధోల్ మండలం ఎడ్‌బిడ్‌కు చెందిన బి.ఆనంద్‌గౌడ్ కూతురు అమెరికాలో ఉంటోంది. ఈ క్రమంలో తండ్రిని అమెరికాకు రప్పించుకునేందుకుగానూ ఆమె తన తండ్రి ఖాతాకు డబ్బు పంపింది. వాటిని డ్రా చేసేందుకు సోమవారం పట్టణంలోని యూనియన్ బ్యాంకుకు వచ్చాడు. బ్యాంక్ నుంచి రూ.5లక్షలు విత్‌డ్రా చేసి స్కూటీ డిక్కీలో పెట్టాడు. కుభీర్ చౌరస్తాలోని సాయిలక్ష్మి బార్‌లో భోజనం చేసేందుకు స్కూటీని బయట నిలిపి లోనికి వెళ్లాడు. ఇదంతా గమనిస్తూ అతన్ని అనుసరించిన దుండగుడు స్కూటీ డిక్కీ తెరిచి నగదును అపహరించుకుపోయాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. బాధితుడు బయటకు వచ్చి చూసేసరికి డిక్కీ తెరిచి ఉండడం, నగదు లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ జి.గోపినాథ్ తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఆగంతకుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

పట్టపగలే రూ.5 లక్షలు చోరీ