
కరత్వాడ ప్రాజెక్టు కుడికాలువకు లీకేజీ
● వృథాగా పోతున్న నీళ్లు ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
బోథ్: మండలంలోని కరత్వాడ ప్రాజెక్టు కుడి కాలువకు లీకేజీ ఏర్పడి కొంతకాలంగా నీరు వృఽథాగా పోతోంది. వర్షాకాలంలో ప్రాజెక్టులో నీటిని ఆపాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాలు లేక ప్రాజెక్టు లోకి నీరు రావడం లేదని, నీరు వృధాగా పోతుండడంతో ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని, రబీ సీజన్‌లో నీటికొరత ఏర్పడే అవకాశం ఉందని వాపోతున్నారు. విషయాన్ని బోథ్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి రాజు అనే యువ రైతు, పలువురు రైతులతో కలిసి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు చేశారు. దీంతో అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు కుడి కాలువ ద్వారా వెళ్తున్న నీటిని ఆపివేశారు.