
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలి
మంచిర్యాలటౌన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని తలపెట్టిన బీసీ రిజర్వేషన్ ధర్నాకు టీఎన్జీవోస్ మద్దతునిస్తుందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీఎన్జీవోస్ సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి అనుముల సతీశ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రావణ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, ఉపాధ్యక్షుడు ప్రకాశ్ పాల్గొన్నారు.