
సమావేశం విజయవంతం చేయాలి
లక్సెట్టిపేట/మందమర్రిరూరల్: ఈ నెల 5న లక్సెట్టిపేటలోని ఎస్‌పీఆర్ ఫంక్షన్‌హాల్‌లో, మందమర్రిలో నిర్వహించే సమావేశాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. సోమవారం ఆయన లక్సెట్టిపేట ఐబీ ఆవరణలో, మందమర్రిలోని బీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. రైతు సమ్మేళన సమావేశాలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో నాయకులు దుర్గం అశోక్, నరేష్, హరిగోపాల్, నరేష్‌చంద్, ముత్తె సత్తయ్య, స్వామిరెడ్డి, దీక్షితులు, సంజీవరావు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.