
కొడుకు పట్టించుకోవడం లేదు
నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. నా భర్త చనిపోయి 15ఏళ్లు అవుతుంది. ఒంటరిగా బతుకుతున్న. నా చిన్న కుమారుడు సమ్మయ్య కరోనాతో మరణించాడు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ భూమి మొత్తం పట్టా చేసుకుని అనుభవిస్తూ పట్టించుకోవడం లేదు. ఆ పట్టా రద్దు చేసి నా పేరిట చేయాలి. నేను మరణించే వరకు ఆలనాపాలన చూసుకునే వారికి చెందేలా చర్యలు తీసుకోవాలి.
– మేడ ఆంకు, శంకరపూర్, కోటపల్లి
అక్రమాలపై విచారణ జరపాలి
ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం జిల్లా కన్వీనర్‌గా గాజుల ముకేష్‌గౌడ్ ప్రకటించుకుని అనేక అవకతవకలకు పాల్పడుతున్నాడు. నెలకు రూ.2.80లక్షల వరకు తీసుకుంటున్నాడు. ప్రశ్నిస్తే సభ్యత్వం తొలగిస్తామని బెదిస్తున్నారు. అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి న్యాయం చేయాలి.
– కోల రాజగౌడ్, మంచిర్యాల

కొడుకు పట్టించుకోవడం లేదు