
టీచర్ల సర్వీసు రికార్డుల పరిశీలన
మంచిర్యాలఅర్బన్: ఉపాధ్యాయుల పదోన్నతుల్లో భాగంగా సర్వీసు రికార్డులు, ధ్రువపత్రాల పరిశీలన సోమవారం స్థానిక జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహించారు. స్కూల్‌అసిస్టెంట్లు, పీఎస్‌హెచ్‌ఎం పదోన్నతి జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు తరలివచ్చారు. పదోన్నతుల కమిటీ సభ్యులు ఉపాధ్యాయుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అర్హత సర్టిఫికేట్లతోపాటు డీఎస్సీలో వచ్చిన మార్కులు, ర్యాంకు, ఉద్యోగంలో చేరిన తేదీ, రూల్ రిజర్వేషన్ ప్రకారం సాధించిన రోస్టర్ పాయింట్లు తదితర వివరాలపై ఆరా తీశారు. స్కూల్ అసిస్టెంట్, ఎల్‌ఎఫ్‌ఎన్, పీడీ పోస్టుల కోసం పదోన్నతుల కమిటీ పరిశీలించింది. పదోన్నతులకు 1ః3 నిష్పత్తిలో సీనియార్టీ జాబితా ప్రకటించారు. సబ్జెక్టుల వారీగా 90ఖాళీలు చూపించారు. జనరల్, వర్గీకరణ మేరకు ఎస్సీలకు గ్రూపులు, దివ్యాంగులకు కేటగిరీ వారీగా పదోన్నతులకు రోస్టర్ విధానంలో కేటాయించారు. ప్రతీ సబ్జె క్టు ఎంఈవో, జీహెచ్‌ఎంతోపాటు కంప్యూటర్ సహాయకులు పరిశీలన చేస్తున్నారు. రెండ్రోజులపాటు దస్త్రాల పరిశీలన కొనసాగనుంది.