
పశుమాంసం పట్టివేత
ఖానాపూర్: మండలంలోని తర్లపాడ్ గ్రామం మీదుగా ఆటోలో తరలిస్తున్న పశుమాంసాన్ని బజరంగ్‌దళ్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పట్టుకున్నారు. కడెం నుంచి గోవధ చేసి తీసుకువస్తున్నారని సమాచారంతో ఆటోను పట్టుకున్నట్లు జిల్లా సంయోజక్ కాసవేణి ప్రణయ్ తెలిపారు. వారు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి ఎస్సై రాహుల్ గైక్వాడ్ చేరుకున్నారు. వెటర్నరీ ఇన్‌చార్జి మండల అధికారి సౌందర్యతో పోస్టుమార్టం నిర్వహించారు. పశుమాంసం శాంపిళ్లు సేకరించి ఆవుదా, ఎద్దుదా అని నిర్ధారణ కోసం ల్యాబ్‌కు పంపినట్లు ఎస్సై తెలిపారు. ఆటోడ్రైవర్ మహమూద్‌పై కేసు నమోదు చేసి, ఆటోను పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కడెం మండల కేంద్రంగా గత ఆరు నెలలుగా ఆవులను వధిస్తూ వివిధ ప్రాంతాలకు మాంసాన్ని తరలిస్తున్నారని జిల్లా సంయోజక్ కాసవేణి ప్రణయ్ ఆరోపించారు. ఆటో వెనకభాగంలో సైతం ఇతర దేశానికి చెందిన జెండాతో ఉన్న వాల్‌పోస్టర్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు పడాల రాజశేఖర్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు మంత్రరాజం సురేశ్, నాయకులు పంబాల శ్రీకాంత్, భూమేశ్, సాయిప్రణీత్, ప్రతాప్, ప్రశాంత్, శ్రీకాంత్, సాయికిరణ్, విన్ను, సనత్, నాగేంద్ర ఉన్నారు.