
ప్రాణం తీసిన బీడీ అలవాటు
● నిర్మల్ జిల్లా దేవునిగూడెంలో ఘటన
దస్తురాబాద్: బీడీ తాగే అలవాటు ఓ వృద్ధుడిని సజీవ దహనం చేసింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం దేవునిగూడెంలో జరిగింది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెల్పుల లింగన్న(80)కు కంటిచూపు సరిగా ఉండదు. కూతురు రమ్య ఇంట్లో ఉంటున్నాడు. బీడీ తాగే అలవాటు ఉన్న లింగన్న శనివారం రాత్రి, లింగన్న బీడీ తాగేందుకు అగ్గి వెలిగించుకున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు దుప్పట్లకు అంటుకుంది. మంటలు చెలరేగి సజీవ దహనమయ్యాడు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు చూసే సరికి, లింగన్న పూర్తిగా కాలిపోయి ఉన్నాడు.కూతురు రమ్య ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. ఖానాపూర్ ప్రభుత్వ వైద్యులు సంఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించారు.