
గ్యాస్ సిలిండర్ లీకేజీ●
● ఇంట్లో వ్యాపించిన మంటలు ● ఏడుగురికి తీవ్ర గాయాలు
బోథ్: ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకేజీ అయి మంటలు వ్యాపించి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని పిప్పల్‌ధరి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సోనేరావు ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకేజీ అయింది. కుటుంబీకులు గమనించి సోనేరావుతోపాటు ఆయన కుమారుడు గంగ ప్రసాద్ లో నికి వెళ్లి చూశారు. సిలిండర్ నుంచి మంటలు వచ్చా యి. ఇంటి పక్కన ఉన్న వారి కుటుంబీకులు లక్ష్మణ్, చందు, బాపూరావు, మహేశ్, లక్ష్మి ఇంట్లోకి వెళ్లి చూడగా మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో వారికి మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలయ్యారు. వారి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని మంట లార్పే ప్రయత్నం చేశారు. గాయపడ్డ వారిని బోథ్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం 108లో రిమ్స్‌కు తరలించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు.