
బాసర క్షేత్రంలో ఎర్రజెండాలు కలకలం
బాసర: జ్ఞాన సరస్వతి క్షేత్రంలో సీపీఐ(ఎం) ఎర్రజెండాలు శనివారం రాత్రి వెలుగుచూశాయి. ఆలయ సమీపంలోని 6వ నంబర్ గది డార్మెటరీ హాల్ అతిథి గృహంలో ఎర్రజెండాలు గుర్తుతెలియని వ్యక్తులు పెట్టడం కలకలం రేపాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి వాటిని తొలగించారు. ఎర్రజెండాలు ఎందుకు పెట్టారో ఆలయ అధికారులు స్పందించకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ భరోసా ప్రతిఒక్కరికీ అందించడమే లక్ష్యం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): కుటుంబ భరోసా పథకం ప్రతిఒక్కరికీ అందడమే లక్ష్యంగా యూనియన్ కృషి చేస్తుందని ప్రొఫెషనల్ ఫొటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేష న్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే.హుస్సేన్ అన్నారు. ఆ దివారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి ఎస్‌వీఎస్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల ఎన్నికై న అధ్యక్షు డు అప్పాసు రాము, ప్రధాన కార్యదర్శి శ్వాస తిరుపతి, కోశాధికారి ముక్కెర స్వామితో ప్ర మాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు ఫొటో మాంత్రికుడు డ్యాగురే చిత్ర పటా నికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం హుస్సేన్ మాట్లాడుతూ యూనియ న్ నుంచి నీట్, ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థులకు రూ.5 వేలు, కుటుంబ పెద్ద మరణిస్తే పిల్లలకు రూ.5 వేలు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా కుటుంబ భరోసా పథకం ద్వారా రూ.5 లక్షల వరకు ఆర్థికసాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి, ఉపాధ్యక్షులు మహేశ్, ఉదయ్, మహిళా అధ్యక్షురాలు జయమాధురి, ఉపాధ్యక్షురాలు ఆశాల శారద, దక్షణ భారత ప్రతినిధి రాజేశ్వర్‌రెడ్డి, మాజీ గౌరవ అధ్యక్షుడు ఎంకే.రాము, మాజీ ఉపాధ్యక్షుడు కనకయ్యగౌడ్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, జిల్లాలోని ఆయా మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు, ఫొటో, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.
‘పంచమి’ ఆవిష్కణ
మంచిర్యాలక్రైం: గంజాయి సేవించడం వలన కలిగే దుష్పరిణామాలపై అక్షయ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించిన ‘పంచమి’ షార్ట్ ఫిల్మ్‌ను డీసీపీ భాస్కర్ ఆదివారం అవిష్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కర్రె తిరుపతి, నిర్మాత బోడకుంట రవీందర్ షార్ట్ ఫిల్మ్ కథను వివరించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ గంజాయి సేవించడంతో కలిగి నస్టాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచేలా షార్ట్‌ఫిల్మ్ రూపొందించడం అభినందనీయమన్నారు. గంజాయి సేవించే వారిలో యువతే ఎక్కువగా ఉందని, గంజాయి రహిత కమిషనరేట్‌గా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో చిత్ర యునిట్ సిబ్బంది, డీవోపీ దుర్గం విజయ్, కుమార్ పాల్గొన్నారు. ప్రధాన పాత్రలో రవీందర్, సిరి నటించారు.

బాసర క్షేత్రంలో ఎర్రజెండాలు కలకలం