ఆదివాసీ దినోత్సవానికి తరలిరావాలి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ దినోత్సవానికి తరలిరావాలి

Aug 4 2025 4:35 AM | Updated on Aug 4 2025 12:05 PM

ఆదివాసీ దినోత్సవానికి తరలిరావాలి

ఆదివాసీ దినోత్సవానికి తరలిరావాలి

ఆదిలాబాద్‌రూరల్‌: జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గార్డెన్‌లో ఈనెల 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలు తరలి రావాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోడం గణేశ్‌ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గార్డెన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మా ట్లాడారు. ఆదివాసీ తొమ్మిది తెగల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుగా కుమురం భీం గూడ నుంచి భారీ ర్యా లీతో ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, డోలు, స న్నాయి, కాళీకోమ్‌ పేప్రే తుడుం వాయిద్యాలతో భారీ ర్యాలీగా ఆదిలాబాద్‌లోని కుమురం భీం చౌక్‌ కు చేరుకుంటారని పేర్కొన్నారు. అనంతరం సభకు చేరుకుని ఆదివాసీల సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు జయవంత్‌రావు, ప్రధాన కార్యదర్శి మనోజ్‌, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రేణుక, జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్పరాణి, ఉపాధ్యక్షురాలు ఇందిరా, నాయకులు రాజు, గణపతి, విష్ణు, రజినీకాంత్‌, సొనేరావు, భుజంగ్‌రావు పాల్గొన్నారు.

గాదిగూడలో నిర్వహించాలి

నార్నూర్‌: ఆదివాసీ దినోత్సవాన్ని గాదిగూడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించాలని గొండ్వాన పంచాయతీ రాయిసెంటర్‌ సార్‌మేడి జుగ్నా క భీంరావు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందూర్‌ సంతోష్‌ పేర్కొన్నారు. గాదిగూడలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ వేడుకలు జరుపుకోవాలన్నారు. ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడు గణేశ్‌, జిల్లా కోశాధికారి మహేందర్‌, గ్రామపటేల్‌ నాగోరావు, గ్రామపెద్దలు లింబా రావు, మారోతి, మాడవి మాన్కు, ఆత్రం మాన్కు, మాజీ సర్పంచ్‌ జైవంతరావు పాల్గొన్నారు.

ఆదివాసీ విద్యార్థి సంఘం కార్యవర్గం..

ఆదివాసీ విద్యార్థి సంఘం మండల కార్యవర్గాన్ని ఏ కగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మె స్రం కేశోరావు, అధ్యక్షుడిగా పెందూర్‌ మధు, ప్రధా న కార్యదర్శిగా మెస్రం వామన్‌, ఉపాధ్యక్షుడిగా కుడ్మేత రామేశ్వర్‌, సలహాదారుడు సాక్కర్‌ శంకర్‌, కోశాధికారిగా టెకం అయ్యు, ప్రచార కార్యదర్శిగా కోట్నాక్‌ శ్యామ్‌రావు, సాంస్కృతిక సలహాదారుగా కుంరం హన్మంతరావు, సభ్యులుగా హెచ్‌కే మారు, ఆత్రం భీంరావు, చిక్రం తిరుపతి ఎన్నికయ్యారు.

తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోడం గణేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement