
కట్టుకున్నోడే కడతేర్చాడు..
● భార్యను కొట్టి చంపిన భర్త ● మద్యానికి బానిసై డబ్బుల కోసం వేధింపులు ● పోలీసుల అదుపులో నిందితుడు ● ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ వెంకటేశ్వర్
జైపూర్: చివరి వరకు తోడుగా ఉంటానని బాసచేసిన భర్తే కాలయముడయ్యాడు. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్యచేశాడు. మద్యం మత్తులో అతిదారుణంగా కట్టెతో కొట్టి చంపాడు. మండలంలోని నర్వ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రానికి చెందిన రాజమణి(48), నర్వ గ్రామానికి చెందిన గోదారి రాజయ్యను ప్రేమించి వివాహాం చేసుకుంది. వీరికి ఒక్క కుమార్తె పూజిత ఉంది. రాజమణి..నర్వ గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తుండగా రాజయ్య సింగరేణిలో సపోర్టుమెన్‌గా పనిచేసి 2020న రిటైర్డ్ అయ్యాడు. కొంతకాలంగా రాజయ్య మద్యానికి బానిసయ్యాడు. వచ్చిన పెన్షన్ డబ్బులతో మద్యం తాగుతూ ఇంకా డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవపడేవాడు. తరచూ మద్యం తాగి భార్యను వేధించేవాడు. ఎప్పుటికై న ఆమెను చంపుతానని బెదిరించేవాడు. శనివారం మద్యం తాగిన రాజయ్య భార్య రాజమణితో రాత్రి గొడవపడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను ఆదివారం ఉదయం కట్టెతో తలపై, శరీరభాగాలపై కొట్టి హత్యచేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు రాజయ్యను అదుపులో తీసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. మృతురాలి కుమార్తె పూజిత కాగా ఆమె శ్రీరాంపూర్‌కు చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

కట్టుకున్నోడే కడతేర్చాడు..

కట్టుకున్నోడే కడతేర్చాడు..