
భావోద్వేగాలు నియంత్రించుకోవాలి
బెల్లంపల్లి/నెన్నెల: విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుకోవాలని, భావోద్వేగాలు నియంత్రించుకోవాలని జిల్లా ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల ఉపసంచాలకులు సీహెచ్.దుర్గాప్రసాద్ అన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల వసతి గృహం, నెన్నెలలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సాంఘిక సంక్షేమ శాఖ సహాయ అధికారి ఎం.రవీందర్‌తో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? సౌకర్యాలు, భోజనం బాగుంటుందా అని ఆరా తీశారు. బాలికలు ఉన్నతంగా చదువుకోవాలన్నారు. గొప్పగా చదువుకుంటే ఉన్నత భవిష్యత్ ఉంటుందని తెలిపారు. వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, స్పెషల్ క్లాస్‌ల కోసం ట్యూటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థినులు అన్నిరంగాల్లో రాణించేలా చర్యలు తీసుకోవా లని తెలిపారు. నెన్నెలలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని వార్డెన్ జయశంకర్‌ను ఆదేశించారు. బెల్లంపల్లి ఎస్సీ సమీకృత బాలికల వసతి గృహం విద్యార్థినులకు కార్పెట్‌లు, బెడ్‌షీట్‌లు, చెప్పులు, స్కూల్ షూస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వసతి గృహం సంక్షేమ అధికారులు వి.విజయలక్ష్మి, కె.సుజాత పాల్గొన్నారు.