
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కలవేన శంకర్
పాతమంచిర్యాల: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కలవేన శంకర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా, మండల కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సదరం సర్టిఫికెట్ల కోసం దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని, నిబంధనలు సడలించాలన్నారు. ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో జరిగే జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీఖాన్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ, రేగుంట చంద్రశేఖర్, చిప్ప నర్సయ్య, దాగం మల్లేశ్, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, లింగం రవి, రేగుంట చంద్రకళ, కే.నగేష్, జిల్లా సమితి సభ్యులు సమ్మయ్య, లక్ష్మీనారాయణ, దేవి పోచన్న, రాజమౌళి, బానేష్, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.