
అగ్రికల్చర్ యూనివర్సిటీ టాపర్‌గా జోగాపూర్ విద్యార్థి
నెన్నెల: మండలంలోని జోగాపూర్ గ్రామానికి చెందిన నికాడి శ్యామల–మధునయ్య దంపతుల కూతురు నికాడి తేజశ్విని జగిత్యాల జిల్లా పొలాసలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది. ఎంఎస్సీ అగ్రికల్చర్‌లో ఉత్తమ ప్రతిభకనబర్చి రెండు బంగారు పతకాలు సాధించింది. యూనివర్సిటీస్థాయిలో అన్ని సబ్జెక్టులలో, ఓవరాల్ గ్రేడ్ పాయింట్లలో మెరిట్ వచ్చినందుకు ఒక గోల్డ్‌మెడల్, ఎంఎస్సీ అగ్రికల్చర్ మేజర్ ఫీల్డ్ జెనటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్‌లో మెరిట్ సాధించినందుకు మరొక బంగారు పతకం సాధించింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనిర్సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డాక్టర్ మంగిలాల్‌జత్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విద్యాసాగర్, వైస్ ఛాన్స్‌లర్ అల్‌దాస్ జానయ్య ఆదివారం సన్మానించి బంగారు పతకాలు ప్రదానం చేశారు.