
‘13న మహాగర్జన విజయవంతం చేయాలి’
కాసిపేట: ఈ నెల 13న మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే చేయూత ఫించన్‌దారుల మహాగర్జన మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు చెన్నూర్ సమ్మయ్య, మండల ఇన్‌చార్జి జీలకర శంకర్ కోరారు. ఆదివారం పింఛన్ దారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యమంలో భాగంగా మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నగురారపు సుమన్, మండలాధ్యక్షుడు కనుకుల సంతోష్, ఉపాధ్యక్షుడు పొలగాని తిరుపతి, రాంటెంకి రాజయ్య, ముంతమల్ల రోజా, కనుకుంట్ల కళావతి, ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ గొడిసెల క్రాంతి, నాయకులు గొడిసెల కృష్ణ, కాంపెల్లి వెంకటేష్, లంక లక్ష్మణ్, దాసరి శంకర్, చొప్పదండి కిషన్, తదితరులు పాల్గొన్నారు.