
బాలింతకు దారి కష్టాలు
● 2 కి.మీ కాలినడకతో ఇంటికి..
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని చిట్యాల్‌బోరి గ్రామస్తులకు వర్షాకాలంలో దారి కష్టాలు తప్పడం లేదు. గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో రెండుచోట్ల వాగులు ప్రవహిస్తాయి. వర్షాలు కురిస్తే రాకపోకలు నిలిచిపోతాయి. నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఆడ లక్ష్మి ఆదిలాబాద్ ఆస్పత్రిలో ప్రసవమై డిశ్చార్జి ఇంటికి పయనమయ్యారు. గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక బాలింత 2 కి.మీ పసికందుతో కాలినడకన వెళ్లారు. రోడ్డు సౌకర్యం, వాగులపై వంతెనలు లేక అత్యవసర సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు పే ర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోతున్నారు.