
యువకుడి మృతికి కారకుడి అరెస్ట్
నిర్మల్‌టౌన్: యువకుడి మృతికి కారకుడిని అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. స్థానిక వెంకటాద్రిపేట్ కాలనీకి చెందిన సల్ల అభిలాష్ తన స్నేహితుడితో కలిసి గతనెలలో స్కూటీపై వెళ్తున్నాడు. బంగల్‌పేట్ కాలనీకి చెందిన బైండ్ల స్వామి మద్యం మత్తులో బైక్ నడుపుతూ ఎదురుగా వచ్చిన స్కూటీని ఢీకొట్టాడు. ప్రమాదంలో అభిషేక్ తీవ్రంగా గాయపడి, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి బైండ్ల స్వామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.