నాడు బ్రిటిష్ కబంధహస్తాల నుండి భారతీయులను విడిపించేందు
● నెరవేరని గోండు బిడ్డ ఆశయం ● నినాదంగానే జల్ జంగల్ జమీన్.. ● ఆగని ఆదివాసీల పోరాటాలు ● అమలు కాని ఆదివాసీ చట్టాలు.. ● కొత్త ప్రభుత్వంపై ఆశలు ● రేపు కుమురంభీం 84వ వర్ధంతి
కిలోమీటరు దూరం నుంచి తాగునీటిని
తెచ్చుకుంటున్న లైన్‌పటార్ వాసులు
జోడేఘాట్ గ్రామం
ఆదివాసీల ఓటు బ్యాంకు కోసం..
ఆదివాసీలను ఓటు బ్యాంకుగా నాయకులు వాడుకుంటున్నారు. ఎన్నికలు వచ్చాయంటే స్టేజీలు ఎక్కి మైకులు చేతబట్టుకుని వాగ్దానాల వర్షం కురిపించడమే నాయకుల వంతు. వారి మాటలకు మోగిస్తున్న చప్పట్లతో నాయకుని కార్యమైతే నెరవేరుతోంది. ఆ తర్వాత వర్షం వెలిశాక ఎండలు కొట్టిన చందంగా మారుతున్నాయి గిరిజనుల బతుకులు. నాయకుల మాటలు వినడానికి సొంపుగా ఉంటాయి. కానీ అవి నిజానికి అందనంత దూరంలో ఉంటాయని పాపం వారికి తెలియదు. 1/70 గురించి ఎరుగని వారుండరు. కానీ నేడు ఏజెన్సీలో పుట్టగొడుగుల్లా మిద్దెలు నిర్మిస్తుంటే వారించే అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప అడ్డుకోవడం లేదు. ఆదివాసీలు ఎప్పటికీ అడవులకే పరిమితమా..? అధికారులు.. నాయకులు.. ఒక్కసారి ఆలోచించండి.
కెరమెరి(ఆసిఫాబాద్): నాటి నుంచి నేటి వరకు ఆది వాసీల పరిస్థితి కడు దయనీయం. భూమి.. నీరు.. అడవిపై ఇంకా వారికి స్వాతంత్య్రం రాలేదు. గిరి జన చట్టాలు గిరిజ నేతరులకు చుట్టాలవుతున్నాయి. అప్పటి నైజాం సర్కారు ఆదివాసీ భూము ల రక్షణకు భూ బదలాయింపు చట్టం, 1/70 తీసుకువచ్చినా రక్షణ కల్పించే అధికార యంత్రాగం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో గిరిజనుల భూములను గిరిజనేతరులు గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమించుకుంటున్నారు. భూ బదలాయింపు నిషేధం ఉన్న షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనేతరుల వలసలు పెరిగి భూముల ఆక్రమణ యథేచ్ఛగా సా గుతోంది. దీంతో గిరిజనులు మళ్లీ అడవిని నరుక్కు ని బతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందులో కూడా గిరిజనులను బతకనీయకుండా అ ధికారులు తరిమేస్తున్నారు. ఆదివాసీ చట్టాలు, భూ ములకు రక్షణ కల్పించకపోవడం ఎవరి తప్పు? అని అమాయక ఆదివాసీలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వజ్రోత్సవాలు జరుపుకున్నా ఆదివాసీల హక్కులు మాత్రం వారి దరిచేరడంలేదు.
ఉపయోగంలోకిరాని ఐదో షెడ్యూల్
భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రకారం అ డవి, భూమి, నీటిపై ఆదివాసీలకు పూర్తిహక్కులు ఉన్నప్పటికీ నూతన చట్టాలు వాటికి తూట్లు పొడుస్తున్నాయి. 2005లో బిల్లు ప్రవేశపెట్టి హక్కులు కల్పిస్తామని గతంలోని ప్రభుత్వాలు చెప్పినా అవి అమలు కాలేదు. ఏజెన్సీ ప్రాంతంతోని నీటి వనరులు పూర్తిగా ఆదివాసీలకే దక్కాలని రాజ్యాంగంలో ఉంది. కుంటలు, చెరువుల నిర్మాణంలో ఆది వాసీలు భూములు కోల్పోయినా ఆనీరు గిరిజనేతరులకు వినియోగమవుతోంది. ఐటీడీఏ నిధులతో నిర్మించిన కుంటలు, చెరువుల్లో పెంచబడే చేపలు, రొయ్యలపై ఆదివాసీలకే హక్కులు దక్కాలని చట్టాలు చెబుతున్నా వారి గోడు పట్టించుకునే కరువయ్యారు. కొంతకాలంగా ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన వారు ఎస్టీలుగా చలామణి అవుతూ నిజమైన గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు. వారి వలసలను నిరోధించే దమ్ము, ధైర్యం అధికారులకు లేక పోగా వారు ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నట్లుగా ధ్రువీకరణ పత్రాలు సైతం జారీ చేసిన ఘనత వారికే దక్కుతుంది.
కనుమరుగవుతున్న జీవోలు
ఆదివాీసీల రక్షణ కోసం గత ప్రభుత్వాలు పొందుపర్చిన జీవోలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగాల్లో వందశాతం గిరిజనులకే చెందాలని ఉన్న జీవో 3ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 50 శాతం వరకు ఏజెన్సీల్లో గిరిజనులకు మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా ఇటీవల ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల్లో ఏజెన్సీ, నాన్‌ఏజెన్సీకి సంబంధం లేకుండా ఏజెన్సీల్లో కూడా గిరిజనేతర ఉద్యోగులను భర్తీ చేసింది. దీంతో ఏజెన్సీ నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు. 1/70 చట్టాన్ని కూడా 2/70 గా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇలా ఉన్నఫళంగా ఒక్కొక్కటిగా చట్టాలు మారుస్తుంటే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్ధకం కానుంది.
కొలాం వీరునికి సలాం..!
నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు జోడేఘాట్‌లో రేపు కుమురం సూరు 27వ వర్ధంతి
కెరమెరి(ఆసిఫాబాద్): మండలంలోని జోడేఘాట్ గ్రామానికి చెందిన కుము రం చిన్ను, మారుబాయి దంపతులకు 1918లో కు మురం సూరు జన్మించారు. చిన్నతనం నుంచి అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం ఆయన నైజం. గోండు, కొలాం జాతి ప్రజలు వెనుకబడడానికి కారణం నైజాం ప్రభుత్వమేనని గ్రహించిన సూరు నైజాం నవాబులు, వారి తాబేదారులు, రజాకార్లు కొనసాగిస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలను సహించలేకపోయాడు. తన జాతిని ఉక్కుసంకెళ్ల నుంచి విముక్తి చేయాలని అనుకున్నాడు. ఆ సమయంలోనే జోడేఘాట్‌కు కుమురంభీం రాక అతనిలో నూతనోత్తేజాన్ని నింపింది. కొలాం, గోండులను ఏకంచేసి కుమురంభీంకు అండగా నిలిచాడు. అలా సమకూరిన బలంతోనే జోడేఘాట్ పరిసరాల్లో 12 గ్రామాలు వెలిశాయి. గ్రామాలను ఆనుకుని ఉన్న వందెకరాల భూమిని ఆదివాసీలు సాగుచేస్తున్నారు. అట్టి భూములను నిజాం రజాకార్లు ఆక్రమించుకున్నారు. ఈ విషయమై అప్పటి కలెక్టర్ నిజాం సాహెబ్‌కు మొరపెట్టుకున్నా స్పందించలేదు. దీంతో పోరాటం తప్పదని భావించిన ఆదివాసీలు కుమురంభీం నాయకత్వంలో సూరుతో కలిసి జల్.. జంగల్..జమీన్ అనే నినాదంతో ఉద్యమం ప్రారంభించారు. అప్పటి నుంచి నైజాం మిలిటరీ ఆదివాసీలు, నాయకులను బెదిరించడం, దౌర్జాన్యాలకు పాల్పడం, చిత్రహింసలకు గురిచేశారు. 1938–40 సంవత్సరంలో ఆసిఫాబాద్ తహసీల్దారు కుమురంభీం, సూరు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారి ఆచూకీ తెలపాలని నైజాం మిలటరీ ఆదివాసీలను చిత్రహింసలు పెట్టింది. ఇలా కొన్నాళ్లు సాగిన యుద్ధంలో అనేక మంది ఆదివాసీలు అసువులు బాసారు. ఈక్రమంలో మడావి కొద్దు 1940లో ఆచూకీ తెలపడంతో కుమురంభీంను కాల్చిచంపారు. అదే పోరాటంలో కుమురంసూరు కుడి చేయి, కుడి కాలు పోగొట్టుకున్నాడు. అనంతరం తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఆరుమాసాలపాటు సమతుల గుండంలో తలదాచుకున్నాడు.
కొలాం ఆశ్రమ పాఠాశాలల ఏర్పాటుకు కృషి
1980లో కొలాం గ్రామాలలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, కొలాం ఆశ్రమ పాఠశాలల ఏర్పాటుకు సూరు కృషి చేశాడు. 1986లో ఐటీడీఏలో కొలాం అభివృద్ధి అధికారిగా సూరును నియమించారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన ప్రభత్వం ‘ఆదివాసీ కొలాం క్రాంతీవీర్’ అనే బిరుదును ప్రదానం చేసింది. ఆగస్టు 10, 1997లో ఆసిఫాబాద్ మండలం శాకన్‌గొందిలో సూరు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రేపు జోడేఘాట్‌లో అధికారికంగా వర్ధంతిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కొలాం ఆదివాసీలు హాజరుకానున్నారు.
నాడు బ్రిటిష్ కబంధహస్తాల నుండి భారతీయులను విడిపించేందు
నాడు బ్రిటిష్ కబంధహస్తాల నుండి భారతీయులను విడిపించేందు
నాడు బ్రిటిష్ కబంధహస్తాల నుండి భారతీయులను విడిపించేందు


