సీఎంతో ముఖాముఖికి కిష్టాపూర్‌ విద్యార్థి.. | - | Sakshi
Sakshi News home page

సీఎంతో ముఖాముఖికి కిష్టాపూర్‌ విద్యార్థి..

Jun 8 2024 1:54 AM | Updated on Jun 8 2024 7:45 AM

సీఎంతో ముఖాముఖికి కిష్టాపూర్‌ విద్యార్థి

సీఎంతో ముఖాముఖికి కిష్టాపూర్‌ విద్యార్థి

మంచిర్యాల: పదో తరగతి ఫలితాల్లో పది జీపీఏ సాధించిన మండలంలోని కిష్టాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి రాథోడ్‌ ఈశ్వర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ముఖాముఖి కార్యక్రమానికి ఎంపికయ్యాడు. ఈ నెల 9న హైదరబాద్‌లోని రవీంద్రభారతీలో వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాడని పాఠశాల హెచ్‌ఎం గుండ రాజన్న తెలిపారు.

కార్యక్రమం అనంతరం విద్యార్థిని, తల్లిదండ్రులను ముఖ్యమంత్రి సన్మానిస్తారని తెలిపారు. ఈ నెల 10న హరిహర కళాభవన్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి విద్యార్థి, ప్రధానోపాధ్యాయుడు, తల్లిదండ్రులను సత్కరిస్తారని పేర్కొన్నారు. వందేమాతరం, విద్యాదాత పురస్కారాలు అందజేస్తారని తెలిపారు. విద్యార్థిని శుక్రవారం ఎంఈవో విజయ్‌కుమార్‌, ఉపాధ్యాయులు దాముక కమలాకర్‌, కమిటీ చైర్మన్‌ మంగ, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement