
ఆర్టీసీ విశ్రాంత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పాతమంచిర్యాల: ఆర్టీసీ విశ్రాంత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆర్టీసీ విశ్రాంత కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫించన్ పెంచి ఆదుకోవాలన్నారు. ఆర్టీసీ విశ్రాంత కార్మిక సంఘం నూ తన కమిటీ ఎన్నిక నిర్వహించారు. రీజినల్ గౌరవ అధ్యక్షుడిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, అధ్యక్షుడిగా గుండా చంద్రమాణిక్యం, కార్యదర్శిగా కేఎంఎస్ రెడ్డి, కోశాధికారిగా ఏబీ.ముబారక్, రాష్ట్ర కమిటీ సభ్యులుగా ప్రకాష్‌లను ఎన్నుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పాల్గొన్నారు.