మంచిర్యాలటౌన్: కోల్‌మైన్స్ పెన్షన్ పథకం(సీఎంపీఎఫ్) 1998 కింద పదవీ విరమణ చేసిన సింగరేణి బొగ్గు కార్మికుల పింఛన్ పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సీఎంపీఎఫ్ కమిషనర్, కోల్ కంట్రోలర్ సజీష్ కుమార్‌ను కోరారు. బుధవారం ఢిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. జీవితాంతం కష్టపడి పని చేసిన కార్మికులు గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలంటే పింఛన్లను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అత్యవసర అంశంగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ స్పందిస్తూ ప్రస్తుత నిబంధనలు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.


