బకాయిలపై కొరడా | - | Sakshi
Sakshi News home page

బకాయిలపై కొరడా

Mar 19 2026 8:28 AM | Updated on Mar 19 2026 8:28 AM

చెన్నూర్‌: మున్సిపాలిటీ పరిధి లో ఇంటి పన్నుల బకాయిదా రులపై అఽధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. లైన్‌గడ్డ స మీపంలో ఇంటి యజమాని గొ డిసెల తిరుపతిరెడ్డి రెండేళ్లుగా ఇంటి పన్ను రూ.30 వేలకు పై గా బకాయి ఉంది. బుధవారం ఆయన ఇంటికి కమిషనర్‌ ము రళీకృష్ణ చేరుకుని తాళం వేశారు.

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి

మంచిర్యాలటౌన్‌: జిల్లాలోని షెడ్యూ ల్డ్‌ కులాల నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, ఆర్థిక పురోగతి పెంపునకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఈవీ 2 వీలర్‌ 185 యూనిట్లు, ఈవీ త్రిచక్ర వాహనం(సరుకు రవా ణా/ప్రయాణికుల రవాణా)ను 70శాతం రాయితీపై 91 యూ నిట్లు, వ్యవసాయ పథకాల్లో సోలార్‌ యూనివర్సల్‌ పంప్‌ కంట్రోల్‌ యూనిట్‌ అందిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 24లోగా ఓబీఎంఎంఎస్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన ధ్రువపత్రాలను జతచేసి జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యాలయంలో అందించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement