
గడ్డి కట్టలు దగ్ధం
జన్నారం: మండలలోని రేండ్లగూడ గ్రా మంలో గడ్డి కట్టలను ట్రాక్టర్‌పై తరలిస్తుండగా ప్రమాదవశాత్తు కట్టలు మినీ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుఽ దవారం రేండ్లగూడకు చెందిన కుతుబు వే రేచోట 90 గడ్డి కట్టలు కొనుగోలు చేసి ట్రా క్టర్ ద్వారా ఇంటికి తరలిస్తుండగా ప్రమాదవశాత్తు కట్టలు మినీ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడగా మంటలు చెలరేగాయి. గడ్డి కట్టలు కాలుతుండగా గ్రామస్తులు వాటిని కిందికి తోసేసి ట్రాక్టర్‌ను అక్కడి నుంచి తొలగించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వాహనంతో అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారుగా రూ.20 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు కుతుబు తెలిపారు.