
వివాహిత అదృశ్యం
వాంకిడి: భర్తతో గొడ వ పడిన ఓ మహిళ అదృశ్యమైనట్లు ఎస్సై సాగర్ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలం చీచ్‌పల్లి గ్రామానికి చెందిన గేడం కాంతారావుకు పదేళ్ల క్రితం మహారాష్ట్రలోని రా జురకు చెందిన మేస్రం సీమతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కొద్ది ోజులుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా వీరి మధ్య గొడవ జరగడంతో సీమ తన పుట్టింటికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లింది. అదేరోజు సాయంత్రం కాంతారావు సీమ తల్లి దండ్రులకు ఫోన్ చేసి అడగగా, ఆమె పుట్టింటికి వెళ్లలేదని తెలి సింది. బంధువులకు ఫోన్ చేసి ఆరా తీసినా జాడ లభించలేదు. దీంతో కాంతారావు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశాడు. సీమ ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు గులాబీ రంగు చీర ధరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.