
ఓవర్‌బ్రిడ్జిపై విద్యుత్ సౌకర్యం కల్పించాలి
మందమర్రిరూరల్: పట్టణంలోని రామన్ కాలనీ వద్ద నూతనంగా రైల్వే ట్రాక్‌పై ఏర్పాటు చేసిన ఓవర్ బ్రిడ్జిపై విద్యుత్ సౌకర్యం కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రాత్రి సమయాల్లో వెళ్తురు లేకపోవడంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులతో పాటు పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. అంతే కాకుండా సరదాగా సమీపంలోని పార్కుకు వెళ్లి ఇంటికి నడుచుకుంటూ వెళ్లే వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటుందన్నారు. వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా, ప్రజలకు ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు వెంటనే ఓవర్ బ్రిడ్జిపై విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.