గల్ఫ్‌లో నాగసముద్రం వాసి మృతి! | - | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లో నాగసముద్రం వాసి మృతి!

Aug 7 2023 1:08 AM | Updated on Aug 7 2023 1:53 PM

- - Sakshi

మంచిర్యాల: మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన దేవ వీరయ్య(55) ఉపాధి నిమిత్తం గత కొన్నేళ్లుగా సౌదీలోని రియాజ్‌కు వెళ్లారు. ఈ నెల ఒకటో తేదీన వీరయ్య అక్కడ గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వాన్ని వేడుకున్న పట్టించుకోలేదు. దీంతో గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ సమితి నాయకులు మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించడంలో ప్రత్యేక చొరవ చూపించారు.

చనిపోయిన ఐదు రోజుల్లోనే మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తెప్పించి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. వీరయ్య అంత్యక్రియల్లో గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు భూమయ్య, వర్కింక్‌ ప్రెసిడెంట్‌ తిరుపతితో పాటు జన్నారం, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement