పథకాన్ని మరిన్ని మండలాలకు విస్తరించాలంటే ముందుగా కిచెన్‌షెడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. మహబూబ్‌నగర్ బోయపల్లి, నవాబుపేటలో తాత్కాలిక వంటశాలల ద్వారా అల్పాహారం తయారు చేసి పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. గతంలో కోడూరు వద్ద ఉన్న కిచెన్‌షెడ్డును రోడ్డు విస్తరణ కారణంగా ఖాళీ చేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ అవసరమైన వంటశాలలు ఏర్పాటు చేస్తేనే పథకాన్ని విస్తరించే అవకాశం ఉంది. దీంతో కిచెన్‌షెడ్ల నిర్మాణం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
దశలవారీగా విస్తరిస్తాం
ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరు మండలాల్లో సుమారు 14 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మరిన్ని పాఠశాలలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ విధానంలో కిచెన్‌షెడ్లను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. విద్యార్థులకు ప్రతిరోజూ తాజా అల్పాహారం అందించాలంటే ఉదయమే వంట చేసి పాఠశాలలకు సరఫరా చేయాలి. అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటూ దశలవారీగా అన్ని ప్రాంతాలకూ ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తాం.
– విజయకుమారి,
జిల్లా విద్యాశాఖ అధికారి, మహబూబ్‌నగర్
●


