కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

Oct 17 2026 7:06 AM | Updated on Oct 17 2026 7:06 AM

● సీఎంకు లేఖ రాసిన పీయూ కాంట్రాక్టు అధ్యాపకులు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌:రాష్ట్రంలోని యూ నివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్‌ చేయాల ని పీయూ కాంట్రాక్టు అధ్యాపకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పీయూలో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న అధ్యాపకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా సీనియర్‌ అధ్యాపకుడు భూమయ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో సుమారు 1,200 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారని తెలిపారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఎలాంటి షరతులు లేకుండా వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్‌ చేశారు. ముందుగా తమను రెగ్యులరైజ్‌ చేసిన తర్వాతే మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత, ఆర్థిక భరోసా లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అర్జున్‌కుమార్‌, రవికుమార్‌, సుదర్శన్‌రెడ్డి, పర్వతాలు, ఈశ్వర్‌కుమార్‌, గాలెన్న, ప్రభాకర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, వెంకటేష్‌, నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement