అట్టహాసంగా హ్యాండ్‌బాల్‌ టోర్నీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా హ్యాండ్‌బాల్‌ టోర్నీ ప్రారంభం

Oct 17 2026 7:06 AM | Updated on Oct 17 2026 7:06 AM

● పాల్గొన ఉమ్మడి జిల్లాల

బాలబాలికల జట్లు

● ప్రారంభించిన పారిశ్రామిక వేత్త

బెక్కరి రాంరెడ్డి డీవైఎస్‌ఓ తదితరులు

● మహబూబ్‌నగర్‌ బాలుర జట్టు

శుభారంభం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్‌ గ్రామర్‌ స్కూల్‌లో శుక్రవారం రాత్రి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–14 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రస్థాయి పోటీల్లో తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల బాల, బాలికల జట్లు పాల్గొన్నాయి. రాష్ట్రస్థాయి అండర్‌–14 ఎస్‌జీఎఫ్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి, డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ముందుగా అతిథులు జ్వోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా బెక్కరి రాంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి టోర్నీలో ఉమ్మడి జిల్లాల బాలబాలికల జట్లు పాల్గొనడం సంతోషఃగా ఉందన్నారు. చదువుతోపాటు క్రీడలు ముఖ్యమని అన్నారు. పోటీల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తి చాటాలని పిలుపునిచ్చారు. ఓటమి తర్వాతే గెలుపు సాధ్యమని అన్నారు. డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం పెరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోరారు. విద్యార్థులకు క్రీడల పరంగా అండర్‌–14 దశ ఎంతో కీలకమని అన్నారు. ఈ దశలో క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ సారిస్తే భవిష్యత్తులో ఉన్నతస్థాయి క్రీడాకారుడిగా ఎదగవచ్చని అన్నారు. అనంతరం ఇటీవలే అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన జిల్లాకు చెందిన సాయిచరణ్‌రెడ్డి, మహేష్‌లను ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్‌, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్‌, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌, రజినికాంత్‌రెడ్డి, ఎండి.జియావుద్దీన్‌, రవికుమార్‌, శంకర్‌, అనిల్‌కుమార్‌, బాల్‌రాజు, రాంమోహన్‌, ప్రదీప్‌కుమార్‌, అహ్మద్‌ హుస్సేన్‌, నర్సింహ, నాగభూషణం, రంజిత్‌కుమార్‌, ముస్తఫా, రియాజ్‌, ప్రణయ్‌ తదితరులు పాల్గొన్నారు.

శుభారంభం చేసిన మహబూబ్‌నగర్‌

ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య మహబూబ్‌నగర్‌ ఉమ్మడి బాలుర జట్టు శుభారంభం చేసింది. మహబూబ్‌నగర్‌ గ్రామర్‌ స్కూల్‌ మైదానంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో జిల్లా బాలుర జట్టు 15–1 గోల్స్‌ తేడాతో ఖమ్మం జట్టుపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో వరంగల్‌ జట్టు13–3 గోల్స్‌ తేడాతో ఆదిలాబాద్‌ జట్టుపై గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement