అచ్చంపేట రూరల్: విద్యుదాఘాతంలో గ్రామ పంచాయతీ కార్మికుడు మృతి చెందిన ఘటన బొమ్మన్పల్లిలో శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సౌట బాలయ్య (50) మల్టీపర్సస్ కార్మికుడిగా విధు లు నిర్వర్తించేవాడు. శుక్రవారం కూడా విధుల్లో భాగంగా స్థానిక మసీదు వద్ద పారిశుద్ధ్య పను లు చేస్తుండగా విద్యుత్ వైరు తెగి బాలయ్య చేతికి తగిలింది. విద్యుదాఘాతంతో బాలయ్య అపస్మారక స్థితికి వెళ్లగా గమనించిన స్థానికు లు అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిన ట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య బొజ్జమ్మతో పాటు ఒక కూతురు ఉన్నారు. బాలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరా రు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దాపూర్ పోలీసులు తెలిపారు.
డీసీఎం వాహనాలు ఢీకొని డ్రైవర్ మృతి
కొల్లాపూర్: డీసీఎం వాహనాలు ఢీకొని డ్రైవర్ మృతిచెందిన ఘటన శుక్రవారం తెల్లవారుఝామున మండలంలోని అంకిరావుపల్లి స్టేజీ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఏపీలోని ఏలూరు జిల్లా నుంచి 14 లక్షల చేపపిల్లలను సింగోటం శ్రీవారిసముద్రం చెరువులో వదిలేందుకు ఐదు డీసీఎంలలో తీసుకొస్తున్నారు. అందులో ఓ డీసీఎం డ్రైవర్ నిద్రమత్తులో తనముందు ఉన్న వాహనాన్ని ఢీకొన్నాడు. కొట్టాడు. మరోవాహనానికి తగలడంతో వాహన ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్ ఏలూరుకు చెందిన రాము(52) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరిని మైరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు, మరొకరిని నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దైవ దర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు..
ఉండవెల్లి: కారు, ఆటో ఎదురెదుగా ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలోని బైరాపురం వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు పట్టణంలోని చెన్నమ సర్కిల్కు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు ఆ టోలో అలంపూర్ జోగుళాంబ అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న ఆటో బైరాపురం శివారులోకి రాగా అలంపూర్ నుంచి వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ఉన్న పద్మావతి (62) అక్కడిక్కడే మృతి చెందగా.. రేవతికి, వడ్డె సత్యనారాయణకు కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారులు హర్షత్, కౌషికకు, కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ మహేఽశ్వర్రెడ్డికి అతడి భార్యకు స్వల్ప గాయాలు కావడంతో వారిని అలంపూర్ చౌరస్తాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం రేవతిని కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పద్మావతి మృతదేహాన్ని అలంపూర్ మార్చురీకి తరలించారు. ఘటన స్థలాన్ని ఎస్ఐ సురేష్ పరిశీలించి వివరాలు సేకరించారు.


