అథ్లెటిక్స్‌ పోటీల్లో పతకాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ పోటీల్లో పతకాలు సాధించాలి

Oct 3 2026 12:50 AM | Updated on Oct 3 2026 12:50 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం సంయుక్త కార్యదర్శి పుట్టి సురేష్‌చందర్‌, జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్ర అన్నారు. సదాశివపేటలో జరిగే జాతీయస్థాయి అంతర్‌ జిల్లాల అండర్‌–14, 16 బాలబాలికల అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల పోటీల ఎంపికలను శుక్రవారం మెయిన్‌ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జెండా ఊపి ప్రారంభించారు. ఎంపికల్లో దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు ఎంపికైన తుదిజట్టును త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నారాయణపేట జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రమణ, ఆనంద్‌కుమార్‌, శ్రీనివాసులు, రమేష్‌బాబు, సీనియర్‌ కోచ్‌లు, పీడీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement