మారేందుకు జైలు జీవితం ఒక అవకాశం | - | Sakshi
Sakshi News home page

మారేందుకు జైలు జీవితం ఒక అవకాశం

Oct 3 2026 12:50 AM | Updated on Oct 3 2026 12:50 AM

పాలమూరు: జైలులో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు చేసిన తప్పులు మళ్లీ పునరావృత్తం కాకుండా, జైలు జీవితం తమలో మార్పు తీసుకువడానికి ఒక అవకాశంగా భావించాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.ప్రేమలత అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తితో పాటు ఎస్పీ డి.జానకి హాజరయ్యారు. మొదట గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం జడ్జి ప్రేమలత మాట్లాడుతూ ఒక్కసారి జైలుకు వచ్చిన తర్వాత నేర ప్రవర్తన వదిలేసి ఉత్తమ పౌరులుగా మారడానికి కృషి చేయాలన్నారు. ఖైదీలు జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత సమాజంలో గౌరవమైన జీవనం కొనసాగించాలన్నారు. న్యాయపరమైన సహాయం అవసరం అయిన ఖైదీలకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సేవలను వినియోగించుకోవాలన్నారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ కొందరు క్షణికావేశంలో నేరాలకు పాల్పడి ఇక్కడికి వస్తుంటారని, అలాంటి వారు తమ తప్పులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జైలు శిక్ష అనేది జీవితానికి ముగింపు కాదని, తమలో మార్పు తెచ్చుకొని భవిష్యత్‌ను ఉత్తమంగా తీర్చిదిద్దుకునేందుకు ఒక అవకాశంగా భావించాలన్నారు. అనంతరం జైలు సూపరింటెండెంట్‌ కాళిదాస్‌ జైలు వార్షిక నివేదికను సమర్పించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి ఇందిర, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాసులు, సీఐ అప్పయ్య, జైలుర్లు అరుణ్‌కుమార్‌, ఉపేందర్‌, డిప్యూటీ జైలర్లు నాగరాజు, గణేష్‌ పాల్గొన్నారు.

ఖైదీలకు క్రీడాపోటీలు

గాంధీ జయంతి సందర్భంగా జిల్లా జైలులో ఉన్న ఖైదీలకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. గెలుపొందిన ఖైదీలకు న్యాయమూర్తితో పాటు ఎస్పీ బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం సత్యసాయి సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో పలు రకాల కార్యక్రమాలు నిర్వహించారు.

నేర ప్రవృత్తిని వీడి ఉత్తమ పౌరులుగా మారాలి

జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.ప్రేమలత

జిల్లా జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement