జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్)/మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్‌హాల్‌లో గాంధీ చిత్రపటానికి, క్లాక్‌టవర్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛమైన సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అహింస, సత్యం, సహనం, శాంతి, మానవతా విలువలు నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. గాంధీజీ ఆశయాలు, విలువలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో నగర మేయర్ జి.మమత, డీఆర్‌ఓ నిర్మల, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి, కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజ్, సీపీఓ నర్సింహులు, టైటస్‌పాల్, రాజీవ్‌రెడ్డి, వన్ టౌన్ సీఐ అప్పయ్య జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


