వాతావరణ పరిస్థితులు పంటలపై ప్రభావం చూపుతాయి. వర్ష సూచ న, ఉష్ణోగ్రత, తేమ వంటి వివరాలను ముందుగానే తెలుసుకుంటే సాగు పనులను అందుకు అనుగుణంగా నిర్వహించుకోవచ్చు. వర్షం వచ్చే సమయంలో పురుగుమందులు, కొన్ని రకాల ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు అవసరం. యాప్‌ల సమాచారం, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకోవాలి.
– కృష్ణకాంత్, ఏఈఓ, ఓబ్లాయిపల్లి క్లస్టర్
తెగుళ్లను తొలిదశలో గుర్తించాలి
పంటలకు వచ్చే చీడపీడలను తొలిదశలో గుర్తిస్తే నియంత్రణ సులభమవుతుంది. ఫొటో ఆధారంగా పంట సమస్యలను గుర్తించే సాంకేతిక వేదికలు అందుబాటులో ఉన్నా యి. సమస్యను గుర్తించిన తర్వాత సూచించిన సస్యరక్షణ చర్యలను మాత్రమే పాటించాలి. అవసరం లేకుండా మందులు కలిపి పిచికారీ చేయడం, మోతాదుకు మించి వినియోగించ డం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. సాంకేతిక సమాచారంతో పాటు శాస్త్రవేత్తలు, వ్యవ సాయ అధికారుల సూచనలను పాటించాలి.
– డాక్టర్ కల్యాణి, జేటీఎస్‌ఏయూ శాస్త్రవేత్త
సద్వినియోగం చేసుకోవాలి..
సాగులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరుగుతోంది. సాగు, ఎరువుల వినియోగం, సస్యరక్షణ, వాతావరణం, మార్కెట్ సమాచారానికి వివిధ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. రైతులు వీటి వినియోగంపై అవగాహన పెంచుకుని సాంకేతిక సేవలను సద్వినియోగం చేసుకోవాలి. గ్రామస్థాయిలో వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. – గోవింద్‌నాయక్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
●


