నోటిఫికేషన్ల తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

నోటిఫికేషన్ల తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలి

Sep 27 2026 1:10 AM | Updated on Sep 27 2026 1:10 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని తెలంగాణ నిరుద్యోగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట యాదయ్య డిమాండ్‌ చేశారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించి భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 40వేల ఉద్యోగాలు, గ్రూప్‌1లో 500, గ్రూప్‌2లో 2 వేల, గ్రూప్‌3, గ్రూప్‌4లో 10 వేల ఉద్యోగాలను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్పష్టమైన జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించి.. అందులో పేర్కొన్న విధంగా నిరంతరం నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి కుమార్‌, ప్రధాన కార్యదర్శి రమేష్‌ సాగర్‌, జిల్లా అధ్యక్షుడు అజయ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి నరసింహ, ఉపాధ్యక్షుడు శేఖర్‌, కార్యదర్శులు తిరుపతి, విజయ్‌, సురేష్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement