కొల్లాపూర్: స్థానిక మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి కుటుంబాన్ని ఏపీకి చెందిన మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఆర్‌కే రోజా పరామర్శించారు. ఆమె భర్త సెల్వమణితో కలిసి శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా సింగోటం వచ్చారు. హర్షవర్దన్‌రెడ్డి తో పాటు ఆయన సతీమణి విజయ, తల్లి బిచ్చమ్మ ను రోజా దంపతులు పరామర్శించి సానుభూతి తెలిపారు. బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అలాగే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాజీ ఓఎస్‌డీ రాజశేఖర్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హర్షవర్దన్‌రెడ్డిని పరామర్శించారు.


