● అండర్–14, అండర్–17 బాలుర
వాలీబాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్
● హోరాహోరీగా మ్యాచ్‌లు.. ఈనెల 28న బాలికల పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) జిల్లాస్థాయి క్రీడల సందడి నెలకొంది. మూడో రోజు శనివారం అండర్–14, అండర్–17 విభాగాల బాలుర వాలీబాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన బాలుర జట్లు పాల్గొని హోరాహోరీగా తలపడ్డాయి. ఈ సందర్భంగా ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయస్థాయిలో జిల్లా పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని అన్నారు. జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ మూడు రోజులుగా జిల్లాస్థాయి పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 28న మెయిన్ స్టేడియంలో అండర్–14, అండర్–17 విభాగాల బాలికల వాలీబాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మహబూబ్‌నగర్ జట్ల విజయం
అండర్–17 బాలుర వాలీబాల్‌లో మహబూబ్‌నగర్ అర్బన్ జట్టు విజేతగా నిలవగా.. మహ్మదాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. అండర్–14 విభాగంలో మహబూబ్‌నగర్ రూరల్ జట్టు విజేతగా, కోయిలకొండ జట్టు రన్నరప్‌గా నిలిచాయి. విజేతలకు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి, నిర్వాహకులు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో పీఈటీఏటీఎస్ జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌గౌడ్, మాజీ కార్యనిర్వాహక కార్యదర్శులు శారదాబాయి, రమేష్‌బాబు, పీడీలు రామేశ్వర్, శ్రీనివాస్‌రెడ్డి, పరశురాం, ఉమాదేవి, నాగమణి, ముస్తఫా, అబ్దుల్లా, రామకృష్ణ, నాగరాజు, రాఘవేందర్, విజయ్‌కుమార్, జగన్, మమత, డీఎస్‌ఏ కోచ్‌లు పర్వేజ్‌పాష, మల్లేష్ పాల్గొన్నారు.


