నేడు పనిచేయనున్న బ్యాంక్‌లు | - | Sakshi
Sakshi News home page

నేడు పనిచేయనున్న బ్యాంక్‌లు

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

నాగర్‌కర్నూల్‌: బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు సమ్మెకు సిద్ధమయ్యారు. యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు విధులను బహిష్కరించి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలపనున్నారు. వరుస సెలవులు, సమ్మెతో బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుండటంతో ఖాతాదారులు ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో జాతీయ, గ్రామీణ, డీసీసీబీతో పాటు ఇతర బ్యాంకులు 292 ఉండగా.. మహబూబ్‌నగర్‌లో 50, నాగర్‌కర్నూల్‌లో 79, వనపర్తిలో 66, గద్వాలలో 58, నారాయణపేటలో 39 ఉన్నాయి. వేలాది మంది రోజువారీగా వివిధ లావాదేవీలు నిర్వహిస్తుంటారు. వరుస సెలవులు, సమ్మె కారణంగా ఐదు రోజుల పాటు సేవలకు అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఆదివారం కూడా బ్యాంకులు పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. సమ్మె ముగిసిన అనంతరం ఒక రోజు బ్యాంకులు పనిచేయగా.. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా మళ్లీ సెలవు ఉండనుంది.

వివిధ రూపాల్లో నిరసనలు

ఉమ్మడి జిల్లాలో 4,800 మందికి పైగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నట్లు యూనియన్‌ నాయకుడు భూపతిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు, ద్విచక్రవాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌లో తొలిరోజు ధర్నాచౌక్‌లో నిరసన, సాంస్కృతిక కార్యక్రమాలు.. రెండో రోజు ధర్నాచౌక్‌ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ.. మూడో రోజు ఫిస్తా హౌస్‌ నుంచి క్లాక్‌టవర్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు.

ఖాతాదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి

వరుస సెలవులు, సమ్మె నేపథ్యంలో ఖాతాదారులు ముందుగానే అవసరమైన లావాదేవీలు పూర్తి చేసుకోవాలి. ఆదివారం బ్యాంకులు పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – చంద్రశేఖర్‌,

జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, నాగర్‌కర్నూల్‌

● రేపటి నుంచి సమ్మెబాటలో బ్యాంకు ఉద్యోగులు

● మూడు రోజుల పాటు సేవలకు అంతరాయం

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement