రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన: ఆర్‌ఎస్‌పీ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన: ఆర్‌ఎస్‌పీ

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

వంగూరు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని జాజాలలో ఆయన పర్యటించారు. ఇటీవల సర్పంచ్‌ కాశమ్మను ఎమ్మెల్యే అవమానపరిచాడన్న అంశంపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సర్పంచ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచుల హక్కులను కాలరాస్తూ వారిని వేధించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందన్నారు. అనంతరం గ్రామంలో కాంగ్రెస్‌ నాయకులు అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దోపిడీ సాగుతుందని వీటన్నింటికీ చరమగీతం పాడాలని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో బొగ్గు నిల్వలు లేకపోవడంతో విద్యుత్‌ కోతలు ఏర్పడుతున్నాయని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మండలంలోని పోల్కంపల్లి, జాజాల విద్యుత్‌ సబ్‌స్టేషన్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని విమర్శించారు. అలాగే చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మండలంలోని పోల్కంపల్లిలో విగ్రహానికి బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌పీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌ నాయకుడు, ఫుడ్‌ కమిషన్‌ సభ్యులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు ఎడ్మసత్యం, నర్సింహగౌడ్‌, గణేష్‌రావు, నరేందర్‌రావు, శ్రీనివాస్‌యాదవ్‌, ఎల్లగౌడ్‌, అంజి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement