జిల్లాను నడిపిస్తున్న నారీశక్తి | - | Sakshi
Sakshi News home page

జిల్లాను నడిపిస్తున్న నారీశక్తి

Sep 27 2026 12:58 AM | Updated on Sep 27 2026 12:58 AM

● పలు కీలక హోదాల్లో మహిళలు

నారీ శక్తి కేవలం నినాదం కాదు.. అది ఒక శక్తివంతమైన పరిపాలన విధానం అని నేటి మహిళా ఉన్నత అధికారులు నిరూపిస్తున్నారు. వంట గదికి పరిమితం కావాల్సిన చేతులే జిల్లా భవిష్యత్‌ను రాసే కలాలను పట్టుకుని, పరిపాలనలో సరికొత్త ప్రమాణాలను సృష్టిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన కీలక పోస్టుల్లో నారీమణులు ఉండటం విశేషం. జిల్లా యంత్రంగాన్ని చక్కదిద్దడంతో పాటు పరిపాలన అధిపతిగా బాధ్యతలతో కలెక్టర్‌ ఖుష్బూగుప్తా, జిల్లా న్యాయ వ్యవస్థను చక్కదిద్దే బాధ్యతలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్‌.ప్రేమలత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా జేఎల్‌బీ హరిప్రియ, శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఎస్పీ డి.జానకి, నగరాన్ని అభివృద్ది చేసే హోదాలో మేయర్‌ జి.మమత ఉండటం విశేషం. వీరితో పాటు మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా డీకే అరుణ కొనసాగుతున్నారు. అలాగే జిల్లా రెవెన్యూ అధికారిగా నిర్మల, జిల్లా విద్యాశాఖాధికారిగా విజయకుమారి, డీఐఈఓగా రమణి, జిల్లా సంక్షేమాధికారిగా సునీత, డీటీసీ శ్రీవాణి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జిగా డి.ఇందిర, మూడో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా అనిత, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా మమతారెడ్డి, నాలుగో అదనపు జూనియర్‌ జడ్జిగా కె.భావన, పోక్సో కోర్టు జడ్జిగా తమన్‌ రాజరాజేశ్వరి, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా జి.రాధిక తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి కీలక బాధ్యతల్లో మహిళలు ఉంటే కేవలం ఫైళ్లకు పరిమితం కాకుండా మానవీయ కోణంతో వారు చేసే పనులు జిల్లా ముఖచిత్రాన్ని మార్చేస్తుంటాయి. రేపటితరం ఆడపిల్లలకు ఈ మహిళా అధికారులే ప్రత్యేక్ష ఉదాహరణలు. కష్టపడి చదివితే ఈ ఏరంగంలోనైనా తిరుగులేని శిఖరాలను అధిరోహించవచ్చని వీరు నిరూపిస్తూనే ఉన్నారు.

ఖుష్బూగుప్తా

జేఎల్‌బీ హరిప్రియ

డీకే అరుణ

1) ఎన్‌.ప్రేమలత

2) డి.జానకి

3) జి.మమత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement