కూతురిని డాక్టర్‌గా చూడాలని తల్లి కల.. | - | Sakshi
Sakshi News home page

కూతురిని డాక్టర్‌గా చూడాలని తల్లి కల..

Sep 27 2026 12:58 AM | Updated on Sep 27 2026 12:58 AM

● ఆస్పత్రిలో ఆయాగా.. కూతురి చదువుకు అండగా..

30 ఏళ్లుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తున్న పద్మకు వైద్యులను చూస్తే ఓ కల కలిగేది. ‘నా కూతురు కూడా ఒకరోజు డాక్టర్‌ కావాలి’ అనేది ఆమె కోరిక. నగరంలోని ఫైర్‌స్టేషన్‌ (టీడీగుట్ట) ప్రాంతానికి చెందిన పద్మ–కృష్ణ దంపతులకు ఇద్దరు పిల్లలు. కృష్ణ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. పద్మ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని నడిపింది. మధ్యతరగతి కుటుంబమైనా.. కూతురు కావేరిని డాక్టర్‌గా చూడాలన్న తల్లి ఆశయానికి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. కావేరికి కూడా వైద్యురాలు కావాలనే లక్ష్యం ఉండటంతో తల్లి కల.. కూతురి లక్ష్యంగా మారింది. ప్రస్తుతం కావేరి సూర్యాపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ చదువుతోంది. ఎంబీబీఎస్‌ తర్వాత పీజీ చేసి ఎండీ జనరల్‌ మెడిసిన్‌ చేయాలనుకుంటోంది. ‘‘మా చదువులకు అమ్మ ఎప్పుడూ ఇబ్బంది రానివ్వలేదు. ఆస్పత్రిలో పనిచేస్తూ ఎన్నో కష్టాలు పడింది. నేను డాక్టర్‌ కావాలన్నదే ఆమె కల. ఎంబీబీఎస్‌ సీటు వచ్చిన తర్వాత ‘మీ కూతురు త్వరలో డాక్టర్‌ కాబోతోంది’ అని ఆస్పత్రిలో వాళ్లు చెప్పినప్పుడు అమ్మ ఎంతో సంతోషించేది’’ అని కావేరి గుర్తుచేసుకుంది. ఆస్పత్రిలో ఆయాగా మొదలైన తల్లి ప్రయాణం.. కూతురిని వైద్యురాలిగా చూసే కలతో ఇప్పుడు నెరవేరే దశకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement