రెడ్‌క్రాస్‌ చైర్మన్‌గా రవికుమార్‌ | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ చైర్మన్‌గా రవికుమార్‌

Sep 27 2026 12:58 AM | Updated on Sep 27 2026 12:58 AM

● వైస్‌ చైర్మన్‌గా రామకృష్ణ, కోశాధికారిగా రమణయ్య

● రెడ్‌క్రాస్‌ సొసైటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

పాలమూరు: సాధారణ ఎన్నికలను తలపించేలా 15 రోజులుగా ఉత్కంఠ రేపిన మహబూబ్‌నగర్‌ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. 15 పోస్టులకు 19 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. నలుగురు ఉపసంహరించుకోవడంతో మిగిలిన 15 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి డి.క్రిష్ణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ నెల 19న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగా.. 24న నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 15 పోస్టులకు 19 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 25న పరిశీలన అనంతరం శనివారం నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా గుండా మనోహర్‌, పవన్‌కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌, రమేష్‌కుమార్‌ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 15 పోస్టులకు 15 మంది మాత్రమే మిగలడంతో వారిని ఏకగ్రీవంగా ప్రకటించారు.

సీల్డ్‌ కవర్‌లో పేర్లు..

ఎన్నికల సందర్భంగా నూతన కార్యవర్గంలో ఎవరెవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కార్యవర్గం పేర్లు సీల్డ్‌ కవర్‌లో రావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ కోశాధికారి జగపతిరావు సీల్డ్‌ కవర్‌ను తెరిచి పేర్లను వెల్లడించారు. అనంతరం నిర్ణయించిన పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. చైర్మన్‌గా కేఎస్‌ రవికుమార్‌, వైస్‌ చైర్మన్‌గా ఆర్‌.రామకృష్ణ, కోశాధికారిగా జి.రమణయ్య, రాష్ట్ర ఈసీ సభ్యుడిగా డాక్టర్‌ శ్యామూల్‌ నామినేషన్లు వేశారు. ఆయా పోస్టులకు ఒక్కో నామినేషన్‌ మాత్రమే రావడంతో వారు ఎన్నికయ్యారు. ఇక కార్యవర్గ సభ్యులుగా బాబుల్‌రెడ్డి, పుట్టపాగ రఘుపతి, డాక్టర్‌ విష్ణుజనార్ధన్‌, లక్ష్మీనారాయణ, దేవిక బాద్మీ, ధర్మరాజు, తిరుపతిరెడ్డి, జయరాములు, రవికుమార్‌ యాదవ్‌, జగపతిరావు, ప్రసాద్‌ ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement