వన్డే లీగ్‌లో మహబూబ్‌నగర్‌ విజయం | - | Sakshi
Sakshi News home page

వన్డే లీగ్‌లో మహబూబ్‌నగర్‌ విజయం

Sep 24 2026 2:18 AM | Updated on Sep 24 2026 2:18 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: హైదరాబాద్‌లో జరుగుతున్న సీ–డివిజన్‌ వన్డే లీగ్‌ చాంపియన్‌షిప్‌లో హెచ్‌సీఏ డిస్ట్రిక్ట్‌–4 (మహబూబ్‌నగర్‌) జట్టు విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు నాలుగు వికెట్ల తేడాతో అక్రెలిక్‌ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన అక్రెలిక్‌ జట్టు 37.2 ఓవర్లలో 10 వికెట్లకు 89 పరుగులు చేసింది. జిల్లా బౌలర్లు అభినవ్‌ 3, ధనూష్‌ 3, వసికర్‌ 2, సోహైల్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన హెచ్‌సీఏ–4 జట్టు 17.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. వన్డే లీగ్‌ మ్యాచ్‌లో జిల్లా జట్టు విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు. రానున్న మ్యాచుల్లో ఇదే స్ఫూర్తితో ఆడి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

విజయం సాధించిన జిల్లా జట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement